ఇల్లందు లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి?
ఇల్లందు లో మొత్తం మూడు థియేటర్లు ఉన్నాయి 🎞️🍿
ఒకటికి కళాంజలి
రెండోది సీతారామ
మూడోది లలిత కళా మందిరం.
ఇల్లందులో ఉన్న మూవీ థియేటర్లు లో కళాంజలి theater ఎక్కడ ఉంది?
అంజలి థియేటర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉంది.
ఇల్లందు లో ఉన్న అన్ని థియేటర్ల కంటే కళాంజలి థియేటర్ ఎక్కువ ఫేమస్, ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఉంటది అలానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కనే.
హాస్పిటల్ కి వచ్చే వాళ్ళు అలానే వెహికల్ కొనడానికి వచ్చే వాళ్ళకి ఒక ల్యాండ్ మార్క్ లాగా కళాంజలి థియేటర్ అనేది ఏర్పడింది అందుకే థియేటర్ ఫేమస్.
ఇల్లందులో ఉన్న మూవీ థియేటర్లు లో సీతా రామ theater ఎక్కడ ఉంది?
సీతా రామ థియేటర్ జగదాంబ సెంటర్ దగ్గర అలానే ఇల్లందు మార్కెట్ మధ్యలో సీతా రామ థియేటర్ ఉంది. థియేటర్ ఎదురుగా ఇల్లందు పబ్లిక్ హైస్కూల్ ఉంటది. ఇల్లందులో ఉన్న తీరం థియేటర్ కూడా మెయిన్ రోడ్డు మీదనే ఉంటది.
సీత రామ థియేటర్ ఎక్కి చూస్తే మీకు ఇల్లందు అంతా కనిపిస్తుంది.
ఎందుకంటే సీతా రామ థియేటర్ ఇల్లందు కి సెంటర్ ప్లేస్ లో కట్టినారు.
ఇల్లందు లో ఉన్న సీత రామ థియేటర్ కి వెళ్ళినప్పుడు ఒకసారి పైకి చూడండి, మీకు ఇల్లందు టాప్ వ్యూ కనిపిస్తది.
ఇల్లందులో ఉన్న మూవీ థియేటర్లు లో లలిత కళా మందిర్ మూవీ theater ఎక్కడ ఉంది?
జగదాంబ సెంటర్ నుంచి భాగ్యనగర్ లేదా కారేపల్లి వెళ్లే దారిలో, సాయిబాబా టెంపుల్ దగ్గర లలితకళామందిర్ మూవీ థియేటర్ ఉంది. కారేపల్లి ఆటోలు ఆగే మెయిన్ రోడ్ దారిలో లలిత కళామందిర్ సినిమా టాకీస్ కనిపిస్తది.
ఇల్లందు లో ఉన్న మూవీ థియేటర్లు లో పార్కింగ్ ప్లేస్ ఉందా?
ఉన్న ఈ మూడు టాకీస్ లో పార్కింగ్ ప్లేస్ ఉన్నది, కళాంజలి థియేటర్లో పార్కింగ్ ప్లేస్ ఇంకా చాలా ఎక్కువగా ఉండేది, థియేటర్ ముంగట చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్లో ఉంది. మీరు తెచ్చుకున్న ఆటో టూ వీలర్ సులభంగా పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
సీతా రామ థియేటర్ కి పార్కింగ్ ప్లేస్ కొంచెం తక్కువ గా ఉంటది, టూ వీలర్ ఈజీగా చేసుకోవచ్చు, ఆటో లేదా కార్ పార్క్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టం.
ఇల్లందు లో ఉన్న మూవీ థియేటర్లు కి బస్టాండ్ నుంచి ఎంత దూరం?
ఇల్లందు బస్ స్టాప్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఈ మూడు థియేటర్లు ఉంటాయి.
థియేటర్ కి పోవాలంటే బస్టాండ్ నుంచి 20 రూపాయలు ఆటో చార్జి తీసుకుంటారు.